Sunday, April 28, 2024

TS | లారీ ఢీకొని రిటైర్డ్ పోలీసు ఉద్యోగి మృతి.. కరీంనగర్​ జిల్లాలో ఘటన

కరీంనగర్​ సిటీలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలతో పాటు రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువయ్యాయి, అడ్డు అదుపు లేని స్పీడు, ఓవర్ లోడు తో పాటు మద్యం తాగి వాహనాలు నడపడం మామూలుగా మారింది. కరీంనగర్ నడి చౌరస్తాలో లోడుతో వెళ్తున్న ఓ లారీ గురువారం ఓ వ్యక్తిని బలి తీసుకుంది. కేశపట్నం గ్రామానికి చెందిన రిటైర్డ్​ పోలీసు ఆపీసర్​ గుర్రం రాజేందర్ తన మోపెడ్ పై సుభాష్ నగర్ లోని పబ్బా కైలాస్ ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లి ఇంటికి వెళ్తున్నాడు.

తిరుగు ప్రయాణంలో మంచిర్యాల చౌరస్తా చేరుకొనగా వెనుక నుండి వస్తున్న లారీ అతి స్పీడుగా, అజాగ్రత్తగా వచ్చి గుర్రం రాజేందర్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ క్రమంలో అతను లారీ చక్రాల కింద పడి ముక్కులు ముక్కలయ్యాడు. అజాగ్రత్తగా నడిపిన డ్రైవర్ కారణంగానే తన తండ్రి చనిపోయాడని తిమ్మాపూర్ కు చెందిన డ్రైవర్ గజ్జల శర్మ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మృతుని కుమారుడు శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement