Friday, March 1, 2024

Peddapalli: మహిళల రక్షణ పోలీసుల బాధ్యత.. ఏసీపీ మహేష్

మహిళల రక్షణ పోలీసుల బాధ్యతని పెద్దపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ తెలియజేశారు. శుక్రవారం రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళల భద్రత పోలీసుల బాధ్యత అనే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈసందర్భంగా మాట్లాడుతూ… మహిళల రక్షణ కోసం షీ టీంలు పనిచేస్తున్నాయన్నారు. మహిళలు, విద్యార్థినీల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పమన్నారు. ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ కు పాల్పడితే జరిమానాలతో పాటు జైలుశిక్ష తప్పదన్నారు. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్త పడాలన్నారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ సిఐ జగదీష్, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ రహీమ్, ఎస్సైలు విజయేందర్, శ్రీనివాస్, వెంకటకృష్ణ, అష్వినితో పాటు పెద్ద సంఖ్యలో పలు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement