Sunday, December 8, 2024

AP: సాయినాధుడిని దర్శించుకున్న టీడీపీ ఎమ్మెల్యే గంటా, ఎమ్మెల్సీ చిరంజీవి

కశింకోట, ఆగస్టు 25 (ప్రభ న్యూస్): మండలంలో పల్లపు సోమవరం గ్రామంలో శ్రీ శిరిడి సాయినాథ్ ఆలయ 10వ వార్షికోత్సవం సందర్భంగా మాజీ మంత్రి, ఉత్తర నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ చిరంజీవి, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ సాయినాధ్ ను దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి గొంతిని శ్రీనివాసరావు అతిధులను ఘనంగా సత్కరించి మెమొంటో అందజేశారు. వేకువజామున నుంచి ఆలయానికి భక్తులు చేరుకుని స్వామి వారిని దర్శించుకున్నారు. 10వేల మంది అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు.

శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం సాయిబాబా ఆలయం మందిరం ముందు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రముఖులు వివిధ పరిశ్రమల పారిశ్రామిక వేత్తలు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గ్రామంలో ఒక పండుగ వాతావరణంగా తలపించింది. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఉగ్గిన రమణ మూర్తి, సిదిరెడ్డి శ్రీను, వేగి గోపికృష్ణ, పెంటకోట రాము, నైనం శెట్టి రమణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement