Thursday, May 2, 2024

TS: మంత్రి గంగుల గెలుపునకు ఖాజీపూర్ గ్రామస్తుల ప్రమాణం..

బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పై నియోజకవర్గంలో ప్రతి వ్యక్తి తన అభిమానాన్ని చాటుకుంటూనే ఉంటారు. వరుసగా 3 పర్యాయాలు విజయం సాధించి ఓటమెరుగని నేతగా పేరుగాంచిన మంత్రి గంగుల, శాసనసభ్యునిగా 4వ సారి విజయం సాధించాలనే ఆకాంక్షతో కరీంనగర్ నియోజకవర్గం కొత్తపల్లి మండలం ఖాజీపూర్ గ్రామస్థులు ఏకగ్రీవ తీర్మాణం చేసారు.

కరీంనగర్ నియోజకవర్గ ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునే గంగుల కమలాకర్ మరోసారి అద్భుత విజయం సాధించాలని ఆకాంక్షించారు. గంగులను మళ్ళీ గెలిపించుకుంటామని ప్రతిజ్ఞ చేసారు. మళ్ళీ కరీంనగర్ ఎమ్మెల్యేగా మంత్రి గంగుల కమలాకర్ ను 4వ సారి గెలిపించుకుంటామంటూ… ప్రమాణం చేశారు. గంగుల మనకు ఎమ్మెల్యే కావడం… మంత్రిగా అవకాశం రావడం అదృష్టమని, మళ్ళీ తిరిగి ఆయన్ను తిరుగులేని మెజార్టీతో గెలిపించుకుంటామంటూ ప్రతినబూనారు. మొత్తం ఖాజీపూర్ గ్రామంలోని ఓట్లన్ని మా కమలాకరన్నకే నంటూ తీర్మాణం చేశారు.

ఈ కార్యక్రమంలో ఖాజీపూర్ సర్పంచ్ ఇల్లందుల రాజమ్మ, మాజీ సర్పంచ్ లు శేఖర్రావు, శ్రీనివాస్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు శంకర్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు పంజాల రమేష్, కార్యకర్తలు సోమినేని తిరుపతి, అంజి గౌడ్, రాము గౌడ్, ఇల్లందుల రాజశేఖర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement