Sunday, April 28, 2024

గ్యాస్ ధరల పెంపుపై నిరసనలు.. రాజీవ్ రహదారిపై రాస్తారోకో..

గ్యాస్ సిలిండర్ ధరల పెంపును నిరసిస్తూ గులాబీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. గురువారం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక కమాన్ చౌరస్తా వద్ద గల రాజీవ్ రహదారిపై తెరాస శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ తీరు, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నిదనాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మాట్లాడుతూ 2014లో ఎన్డీఏ కేంద్రంలో అధికారం లోకి వచ్చిన సమయంలో 470 రూపాయలున్న గ్యాస్ ధర ప్రస్తుతం 1105 రూపాయలకు చేరుకుందన్నారు. పెట్రో ఉత్పత్తులతో పాటు గ్యాస్ ధరల పెంప వల్ల సామాన్యులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల జీవితాల్లో వెలుగులుండేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస పట్టణ అధ్యక్షులు రాజ్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement