Thursday, April 25, 2024

అర్ధరాత్రి ఫోటోగ్రాఫర్‌ అంత్యక్రియలు..

ఎల్లారెడ్డిపేట: కరోనా మృతుల అంతిమ సంస్కారంలో కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరున్నా లేకున్నా కరోనా మృతుల అంతిమ సంస్కారం గౌరవంగా జరిపుంచుటకు మేమున్నామని ముందుంటున్నారు మండలంలోని గొల్లపల్లి గ్రామ ప్రజా ప్రతినిధులు, యువకులు. వరుసగా గొల్లపల్లి, బొప్పాపూర్‌ గ్రామాలలో కరోనా బారిన పడి 15 రోజుల్లో ఐదుగురు వ్యక్తులు మరణించారు. వారిలో గొల్లపల్లికి చెందిన వారే రోజుకు ఒక్కరుగా ముగ్గురు మరణించారు. కరోనాతో మరణించారని తెలిస్తే చాలు కులం, సంఘం, బంధువులు, కుటు-ంబంలోని అన్నదమ్ములు కూడా మృతుల అంతిమ సంస్కారంకు కూడా రాలేని దుర్భర పరిస్థితి నెలకొంది. కరోనాతో మరణిస్తే ముఖం చాటేయకుండా దూరంగా ఉండి చూడాలని, వారిని అనాధ శవాలుగా చేయవద్దని, వారి కుటుంబాలకు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలని, కరోనా మృతుల అంతిమ సంస్కారం గౌరవంగా జరిపించండి.. అని కోరుతూ ఆంధ్రప్రభలో వచ్చిన కథనానికి మండలంలోని అందరిలో ఆలోచన కలిగించింది. కరోనాతో మరణించిన గొల్లపల్లికి చెందిన సీనియర్‌ ఫోటోగ్రాఫర్‌ నాగుల నారాయణ అంత్యక్రియల్లో సర్పంచ్‌ భర్త పాశం దేవ రెడ్డి, ఉపసర్పంచ్‌ దేవయ్య, ఎంపిటిసి ల్యాగల శ్రీనివాస్‌ రెడ్డి, పి ఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌, జర్నలిస్టు బుగ్గ కృష్ణమూర్తి, వార్డుసభ్యులు దాసరి గణేష్, నర్సారెడ్డి, సత్తిరెడ్డి, పాటి దేవయ్యలు, ఇరు గ్రామాల సర్పంచ్‌లు కరోనా మృతులు అనాధలు కారని, అండగా మేమున్నామంటూ నిలిచారు. ఫోటో గ్రాఫర్‌ మృతదేహం వచ్చేలోపు ద హన సంస్కారం కోసం చితి ఏర్పాటు- చేయించిన నాయకులు మృత దేహం రాగానే సంప్రదాయం ప్రకారం మృత దేహాన్ని ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. కొడుకులు ఇద్దరు శ్రీకాంత్‌, శ్రీధర్‌, కూతురు జ్యోతి, అల్లుడి సమక్షంలో అర్థరాత్రి అంతిమ సంస్కారం పూర్తి చేయించారు. కరోనాతో మరణించిన వారు అనాధలు కారని, అందరూ అండగా నిలవాలని నిరూపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement