Thursday, March 28, 2024

అమరావతిని మరో హైదరాబాద్ చేయాలనుకున్నా: చంద్రబాబు

హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన అనుభవంతోనే అమరావతిని కూడా అభివృద్ధి చేయాలకున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి కోసం రైతులు చూపుతున్న తెగువ భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి కలిగిస్తుందని వ్యాఖ్యానించారు. ఎన్నో అవమానాలు భరించి చరిత్రలో నిలిచిపోయే పోరాటం చేస్తున్న..అమరావతి పోరాట వీరులందరికీ వందనాలు తెలిపారు. ముందుచూపుతోనే జినోమ్ వ్యాలీకి శ్రీకారం చుట్టామని తెలిపారు. కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధి చేసేందుకు ఇప్పడు జినోమ్ వ్యాలీ ఉపయోగపడిందని చంద్రబాబు గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement