Saturday, May 18, 2024

గ్రామాల అభివృద్దే ధ్యేయం: పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్దే ధ్యేయంగా పని చేస్తున్నామని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ సుద్దాల చిన్నకల్వల గ్రామల్లో 27 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సిసి రోడ్ల పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తున్నదని, గ్రామాల్లో సిసి రోడ్లు, డ్రైనేజీలు కల్వర్టులతో పాటు ఇతర పనులకు కోట్లాది రూపాయలు మంజూరు చేస్తుందన్నారు. రాబోయే కాలంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement