Saturday, April 27, 2024

సృజనాత్మకతను పెంచే వైజ్ఞానిక ప్రదర్శనలు

విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను పెంచేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని జిల్లా విద్యాధికారి మాధవి పేర్కొన్నారు. మంగళవారం పెద్దపల్లి మండలం బొంపల్లి గ్రామంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సైన్స్‌ ఫేర్‌లో భాగంగా విద్యార్థుల ప్రదర్శనలను డీఈఓ తిలకించి అభినందించారు. వైజ్ఞానిక ప్రదర్శనల ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యత వెలుగులోకి వస్తుందన్నారు. జిల్లా విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలలో రాణిచేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఉపయోగ పడుతున్నాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement