Sunday, June 23, 2024

Breaking: రేవంత్ రెడ్డికి చంద్రబాబు సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వలే: జగ్గారెడ్డి సంచలన ఆరోపణ

సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి చంద్రబాబు సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వలేని ఆరోపించారు.  రేవంత్ రెడ్డి అసలు స్వరూపం ఎవరికీ తెలియదన్నారు. మొన్న రేవంత్ తనను కలిసినప్పుడు వివాదాలపై ఏమీ మాట్లాడలేదన్నారు. సీఎం సీరియస్ గా ఉన్నాడని తనకు ఫోన్ వచ్చిందని రేవంత్ చెప్పాడని తెలిపారు. రేవంత్ తో కలిసి పని చేయడానికి ఇబ్బందిలేదని ఎన్నో సార్లు చెప్పానని అన్నారు. అయినా సోషల్ మీడియాలో టీఆర్ఎస్ ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ లో ఉండటం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. తాను టీఆర్ఎస్ లో చేరినట్లు ఫొటీలు మార్ఫింగ్ చేసి ట్రోల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement