Sunday, April 28, 2024

TS : పెద్దపల్లిలో ఘనంగా రంజాన్… వేడుకల్లో పాల్గొన్నఎమ్మెల్యే

పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 11(ప్రభ న్యూస్): ముస్లింల అత్యంత పవిత్ర పర్వదినం రంజాన్ వేడుకలు పెద్దపల్లిలో గురువారం చందపల్లి ఈద్గా వద్ద ఘనంగా నిర్వహించారు. ముస్లింలు చిన్న, పెద్ద నూతన వస్త్రాలు ధరించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలను చల్లంగా చూడాలని అల్లాను వేడుకున్నామన్నారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు గోపగాని సారయ్య గౌడ్, నూగిల్ల మల్లయ్య, బూషణవేణ సురేష్ గౌడ్, మస్రత్, బొడ్డుపల్లి శ్రీనివాస్, బూతగడ్డ సంపత్, దొడ్డుపల్లి జగదీష్, తిరుపతి రావు, ఆరె సంతోష్, దేవరకొండ రాజు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement