Friday, May 10, 2024

ప్రేరణ-2023ని ప్రారంభించిన మంత్రి గంగుల

కరీంనగర్ కమిషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో యువతకు డ్రగ్స్, ఆన్లైన్ మోసాలు, హోం లోన్ యాప్ లు, కెరీర్ గైడెన్స్ లపై అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ప్రేరణ 2023 కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడుతో కలిసి ప్రారంభించారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఉన్నతి గార్డెన్స్ లో ప్రేరణ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా యువతకు మంత్రి గంగుల, కలెక్టర్ కర్ణ,న్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు పలు సూచనలు ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement