Friday, April 26, 2024

నిరాడంబరంగా లక్ష్మి నర్సిహ్మస్వామి రథోత్సవం..

జూలపల్లి: కరోనా కారణంగా శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి జాతర నిరాడంబరంగా సాగింది. మండలంలోని పెద్దాపూర్‌ గ్రామ శివారులోని శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా నిబంధనలు ఉండటంతో ఆలయ ప్రాంగణం వెలవెల పోయింది. అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు ఆలయంలోకి ప్రవేశం లేనందున బయటనుండి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ భక్తులు భౌతిక దూరం పాటిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. జై తెలంగాణ మాల మహానాడు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు నల్లాల కనకరాజు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా సుమారు 50వేల మంది స్వామివారిని దర్శించుకుని రథోత్సవంలో పాల్గొనే వారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం ఆలయాల దర్శనం నిలిపి వేయగా పరిమిత సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకుని వెళ్లారు కరోనా కారణంగా పూర్వవైభవం కనుమరుగైంది. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ భారతి జ్యోతిబస్‌, రవీందర్‌ రెడ్డి, ఈర్ల మల్లేశం, ఎంపిటిసి దండే వెంకటేశ్వర్లు, నల్లాల కనకరాజు, బొజ్జ శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement