Sunday, April 28, 2024

Kidnap : రేచపల్లిలో కిడ్నాప్

జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామానికి చెందిన పోగుల రాజేశంను గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం కిడ్నాప్ చేశారు. రేచపల్లిలోని తన స్వగృహంలో ఉన్న రాజేశంను రెండు వీఐపీ కార్లలో వచ్చిన దుండ‌గులు బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లారు. కార్లకు అడ్డు తిరిగిన కొడుకును సైతం ప్రక్కకు నెట్టేశారు.అదేవిధంగా వెంట వెళ్లిన భార్యను మార్గ మధ్యలో కారు నుండి తోసేశారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement