Thursday, May 2, 2024

TS: అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ కు అంతర్జాతీయ గుర్తింపు..

అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ కు అంతర్జాతీయ గుర్తింపు, ప్రతిష్టాత్మక అంతర్జాతీయ గ్రీన్ స్కూల్ అవార్డు వచ్చింది. అత్యుత్తమ విద్యా విధానాల ద్వారా విద్యార్థులకు నాణ్యత విద్య అందిస్తున్నామని, పర్యావరణ పరిరక్షణ పద్ధతులను చాలా స్ఫూర్తిదాయకంగా అమలు పరుస్తున్నామని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నట వి.నరేందర్ రెడ్డి అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ కు అమెరికాలోని నూయార్క్ లో గ్రీన్ మెంటర్ అవార్డ్స్ వారు నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో భాగంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అవార్డు అందజేయడం పట్ల పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అత్యాధునిక వసతులతో విద్యనందిస్తూ, విద్యా విధానాలను విజయవంతంగా అమలు పరుస్తూ సమాజానికి ప్రమాణికంగా నిలుస్తూ పరిరక్షణకు చేయూతనిస్తూ అగ్రగామిగా కొనసాగుతున్నదని చెప్పారు. పాఠశాలలో అందిస్తున్న ప్రతి వసతి అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నదని చెప్పారు. ప్రతి అంశాన్ని చక్కగా భోధిస్తూ సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తూ ఉత్తమంగా కార్యకలాపాలను నిర్వర్తిస్తున్నామని తెలిపారు. పాఠశాల వార్షిక ప్రణాళికలో భాగంగా అపార అనుభవం గల ఉపాధ్యాయులతో విద్యార్థులకు నాణత్య విద్యతో పాటు సర్వతోముఖాభివృద్ధికై అహర్నిశలు కృషి చేస్తున్నామని, సత్ఫలితాలు సాధిస్తున్నామని చెప్పారు.

- Advertisement -

గత 33 సంవ్సరాలుగా విద్యార్థులకు అనుసరిస్తున్న బోధన పద్ధతులను, ఆదర్శనీయంగా కొనసాగిస్తున్న బోధనను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా మార్గదర్శకంగా నిలుస్తూ చక్కటి సంచలనాత్మక ఫలితాలను సాధిస్తున్నదని చెప్పారు. ఇటీవల కాలంలో అమెరికాలోని సూయ్యార్క్ నిర్వహించినటువంటి అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ వారి సమావేశంలో భాగంగా నిర్వహింపబడిన అంతర్జాతీయ గ్రీన్ స్కూల్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో అతిరథమహారధులు, ప్రఖ్యాత వ్యక్తుల చేతుల మీదుగా పాఠశాల అవలంభిస్తున్న పలు విద్యా విధానాలను ప్రశంసిస్తూ అవార్డును ప్రధానం చేశారు.

ఈ అవార్డు రావడం ద్వారా విద్యాసంస్థల బాధ్యత మరింత రెట్టింపు అయినదని ప్రతిష్టాత్మక అవార్డు రావడం వల్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ అవార్డు రావడానికి ఎల్లప్పుడూ చేయూతనిస్తూ ఉత్సాహ పరుస్తున్న తల్లిదండ్రులకు, తరగతి గదుల్లో అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తూ విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న సిబ్బందికి, ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేశారు. అవార్డు రావడంతో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి తెలంగాణ ఖ్యాతిని రెట్టింపు చేశారని, భారతదేశ విద్యా విధానానికి వన్నె తెచ్చారని పలువురు విద్యావేత్తలు, శ్రేయోభిలాషులు, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement