Sunday, May 5, 2024

డ్రంక్ అండ్ డ్రైవ్ లో జైలు శిక్ష.. ఇద్దరికి ఏడు వేల జరిమానా..

మద్యం సేవించి వాహనాలు నడిపిన ఇద్దరికీ న్యాయమూర్తి ఒకరోజు జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్ పేర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి పట్టుబడిన వారిని జూనియర్ సివిల్ రాణి ఎదుట హాజరుపరచగా రామగుండం మండలం జనగామకు చెందిన కొడారి సుమన్ కు ఒకరోజు జైలు శిక్షతోపాటు నాలుగు వేల రూపాయల జరిమానా, పెద్దపల్లి మండలం అందుగులపల్లి గ్రామానికి చెందిన సిద్ధార్థ రవి కి ఒకరోజు జైలు శిక్ష మూడువేల రూపాయల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానలతో పాటు జైలు శిక్ష తప్పదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement