Saturday, May 18, 2024

గీత కార్మికులపై సవతి తల్లి ప్రేమ..

ఓదెల: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో గీత కార్మికులకు సవతి తల్లి ప్రేమ చూపుతోందని సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంఘం ఓదెల మండల అధ్యక్షులు రంగు రాజేష్‌ గౌడ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. విలేకరులతో మాట్లాడుతూ గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న గీత కార్మికులకు అందుతున్న సహాయం అంతంత మాత్రంగానే ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో గీత కార్మికులు ప్రధాన పాత్ర వహించారని, రాష్ట్రం ఏర్పడ్డాక బడ్జెట్‌లో మాత్రం గీత కార్మికుల సంక్షేమానికి రూ. 25 కోట్లు- మాత్రమే కేటాయించడం సమంజసం కాదన్నారు. తాటి, ఈత కల్లు వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న గీత కార్మికుల జీవితాలలో వెలుగు కోసం బడ్జెట్‌ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గీత వృత్తిపై ఆధారపడి రాష్ట్రంలో 5 లక్షల కుటు-ంబాలు జీవిస్తున్నాయని, వారికి అన్యాయం జరగకూడదంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పెంచాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement