Wednesday, December 6, 2023

Peddapalli: 27న గణేష్ నిమజ్జనం.. చవితి తర్వాత 10వరోజు చేయాల్సిందే..

గణేష్ నిమజ్జనం ఈనెల 27న జరుపుకోవాలని బ్రాహ్మణ సంఘం స్పష్టం చేసింది. సోమవారం పెద్దపల్లి ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… భాద్రపద శుద్ధ చవితి రోజున గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయన్నారు. తొమ్మిది రోజుల అనంతరం పదవ రోజున ఉత్తర పూజ అనంతరం నిమజ్జనం జరుపు కోవల్సిందేనన్నారు.

- Advertisement -
   

నిర్వాహకులు బుధవారం రోజున మాత్రమే శోభాయాత్ర పూర్తి చేసి నిమజ్జనం పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణులు కొండపాక శ్రీనివాస్, పెండ్యాల శ్రీనివాస్, నాగేశ్వర శర్మ, ఏసీపీ ఎడ్ల మహేష్, సిఐ అనిల్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement