Friday, June 14, 2024

KNR: క్యాప్సికం మాలల అలంకరణలో దుర్గాభవానీ అమ్మవారు

కరీంనగర్‌ మండలం నగునూర్‌లోని శ్రీదుర్గాభవానీ ఆలయంలో ఆలయ ధర్మాధికారి పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యలో జరుగుతున్న ఆషాడమాసం శాఖాంబరీ ఉత్సవాల్లో భాగంగా శనివారం శ్రీదుర్గాభవానీ అమ్మవారిని క్యాప్సికం మాలలతో అలంకరించారు. ఆలయ పూజారులు అమ్మవారికి విశేష హారతులిచ్చి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ పూజల్లో ఆలయ ఫౌండర్‌ చైర్మెన్‌ వంగల లక్ష్మన్, ఆలయ కమిటి సభ్యులతో పాటు భక్తులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement