Monday, April 29, 2024

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. కలెక్టర్‌ డా. సంగీత

పెద్దపల్లి: పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ పర్కొన్నారు. శనివారం పెద్దపల్లి మున్సిపల్‌ పరిధిలోని పలు వార్డుల్లో పర్యటించిన కలెక్టర్‌ పట్టణ ప్రగతి పనులను పర్యవేక్షించారు. 18వ వార్డు తెనుగువాడ, 12వ వార్డులో నిర్మిస్తున్న స్మశాన వాటికల పనులను పరిశీలించి పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. అలాగే తెనుగువాడలో ఏర్పాటు చేసిన నర్సరీ పరిశీలించి మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. బందంపల్లి 1వ వార్డు నుంచి రాజీవ్‌ రహదారి వెంట మొక్కలను రీప్లేస్‌ చేయాలని అధికారులకు సూచించారు. అలాగే ఫ్లైఓవర్‌ గోడలకు పెయింటింగ్‌ వేసి సుందరీకరణ పనులు చేపట్టాలన్నారు. అలాగే పెద్దపల్లి పట్టణంలోని ఎల్లమ్మ చెరువు కట్ట పనులు పరిశీలించిన కలెక్టర్‌ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పట్టణంలో రోడ్లు, పారిశుధ్య నిర్వహణ మెరుగు పరచాలని అధికారులకు కలెక్టర్‌ సూచించారు. ఈకార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి, మేనేజర్‌ శివ ప్రసాద్‌, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement