Saturday, May 4, 2024

అప్రమత్తంగా ఉంటేనే కరోనా దూరం..

కాల్వశ్రీరాంపూర్‌: మండల ప్రజలు అప్రమత్తంగా ఉండడం ద్వారానే కరోనా నుంచి ప్రాణాలను కాపాడుకోగలుగుతారని కాల్వశ్రీరాంపూర్‌ తహసీల్దార్‌ సునిత పేర్కొన్నారు. కరోనా రెండో దశలో రోజు రోజుకు కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని, చిన్న చిన్న పనులుంటే వాయిదా వేసుకోవాలని కోరారు. 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యాక్సీనేషన్‌ చేయించుకోవాలని కోరారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. జన సందోహం ఉన్న చోట సంచరించవద్దని, ఏదైనా పని మీద బయటకు వెళ్లితే, మాస్కు, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలన్నారు. మాస్కు ధరించని వారికి రూ. వెయ్యి జరిమానా విధిస్తామని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement