Sunday, April 28, 2024

TS: మానకొండూరు పెద్ద చెరువును పరిశీలించిన కలెక్టర్, సీపీ

మానకొండూరు మండల కేంద్రంలోని పెద్ద చెరువును మంగళవారం రెవెన్యూ మున్సిపల్ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ బి.గోపి, సిపి సుబ్బారాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మానకొండూరు చెరువులో మండలంలోని గణేష్ విగ్రహాలే కాకుండా జిల్లా కేంద్రం నుండి అధిక సంఖ్యలో భారీగా వినాయక విగ్రహాలు నిమజ్జనానికి తరలి వస్తాయని, ఎలాంటి అసంఘటనలు జరగకుండా భారీ బందోబస్తుతో నిమజ్జనం ఏర్పాట్లు చేయనున్నట్లు వారు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement