Saturday, May 4, 2024

Chennur : రోడ్డు ప్రమాదంలో.. రేషన్ డీలర్ మృతి

చెన్నూర్: మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం బావురావుపేట గ్రామ రేషన్ డీలర్ బెల్లంపల్లి జక్కగౌడ్(55) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రాత్రి చెన్నూరు పట్టణంలో పనులు ముగించుకొని జాతీయ రహదారి పై మోటర్ సైకిల్ పై తన ఇంటికి వెళ్తుండగా నూతనంగా నిర్మాణం అవుతున్న టోల్ ప్లాజా సమీపంలో మంచిర్యాల వైపు నుంచి ఛత్తీష ఘాడ్ వైపు ప్రయాణికులతో అతి వేగంగా వెళుతున్న తూఫాన్ వాహనం డీ కొట్టడంతో జక్కగౌడ్ అక్కడిక్కడే మృతిచెందారు. ప్రమాద సంఘటన గమనించిన పలువురు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement