Wednesday, May 15, 2024

Pawan Kalyan -తెలంగాణ‌లో పోటీకి జ‌న‌సేన సై – వారాహి టూర్ కు ప్లాన్..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: తెలంగాణలోనూ వారాహి యాత్ర చేస్తానని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణాలో జనసేన పోటీ-కి దిగి సత్తా చాటు-తుందని పేర్కొన్నారు. జనసేన తెలంగాణలో బలమైన శక్తిగా అవతరించబోతోందని పవన్‌ కళ్యాణ్‌ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ఉనికిని కాపాడుకుంటూ బలమైన భావజాలానికి కట్టు-బడి ఉంటే మంచి రోజులు వాటంతట అవే వస్తాయని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం దాదాపు 1300 మంది ఆత్మబలిదానాలు చేశారని, వాళ్ల ఆకాంక్ష నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ యువతకు అందకపోతే ప్రత్యేక రాష్ట్రం సాధించి నిష్ప్రయోజమని పేర్కొన్నారు. ఊరికి పదిమంది బలంగా నిలబడటం వల్లే ప్రత్యేక తెలంగాణ సాకారం అయ్యిందని చెప్పారు.

గుంటూరు జిల్లా మంగళగిరిలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ నాయకులతో పవన్‌ కళ్యాణ్‌ సమావేశమయ్యారు. తెలంగాణ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 26 నియోజకవర్గాలకు ఇన్‌చార్జులని నియమించారు. వారందరికీ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ, జనసేన భావజాలానికి ఆకర్షితులైన యువత ప్రతి గ్రామంలో ఉన్నారని పేర్కొన్నారు. ఆ భావాన్ని పట్టు-కొని ముందుకెళితే ఏదైనా సాధించగలమని, తెలంగాణ అభివృద్ధి సాధించాలి, ఉద్యమ ఆకాంక్ష నెరవేరాలి అనేది జనసేన ఆకాంక్ష అన్నారు. ఏ రాజకీయ పార్టీలోనూ ఇంతమంది కొత్తవారికి అవకాశం రాదని, వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

26 నియోజకవర్గాల బాధ్యుల వీరే..
నేమూరి శంకర్‌ గౌడ్‌ (కూకట్‌పల్లి), పొన్నూరు లక్ష్మి సాయి శిరీష (ఎల్బీ నగర్‌), వంగ లక్ష్మణగౌడ్‌ (నాగర్‌ కర్నూలు), తేజావత్‌ సంపత్‌నాయక్‌ (వైరా), మిరియాల రామకృష్ణ (ఖమ్మం), గోకుల రవీందర్‌రెడ్డి (మునుగోడు), నందగిరి సతీష్‌ కుమార్‌ (కుత్బుల్లాపూర్‌), డాక్టర్‌ మాధవరెడ్డి (శేరిలింగంపల్లి), ఎడమ రాజేష్‌ (పటాన్‌ చెరు), మండపాక కావ్య (సనత్‌ నగర్‌), నిహారిక నాయుడు (ఉప్పల్‌), శివ కార్తీక్‌ (కో కన్వీనర్‌- ఉప్పల్‌), వేముల కార్తీక్‌ (కొత్తగూడెం), డేగల రామచంద్రరావు (అశ్వరావుపేట), పేవి.నగేష్‌ (పాలకుర్తి), మేరుగు శివకోటి యాదవ్‌ (నర్సంపేట), గాదె పృథ్వీ (స్టేషన్‌ ఘనపూర్‌), తగరపు శ్రీనివాస్‌ (హుస్నాబాద్‌), మూల హరీష్‌ గౌడ్‌ (రామగుండం), బెక్కం జనార్దన్‌ (జగిత్యాల), చెరుకుపల్లి రామలింగయ్య (నకిరేకల్‌), ఎస్‌.నాగేశ్వరరావు (హుజూర్‌ నగర్‌), మాయ రమేష్‌ (మంథని), మేకల సతీష్‌ రెడ్డి (కోదాడ), బండి నరేష్‌ (సత్తుపల్లి), బెరి వంశీకృష్ణ (వరంగల్‌ వెస్ట్‌), బాలు గౌడ్‌ (వరంగల్‌ ఈస్ట్‌).

Advertisement

తాజా వార్తలు

Advertisement