Monday, April 12, 2021

కరోనాతో జాగ్రత్త.. ఫ్లెక్సీలతో ప్రచారం..

పెద్దపల్లి ‌: జిల్లాలోని గ్రామాల్లో కరోనా విజృంభిస్తున్న తరుణంలో తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని లేకుంటే రూ.1000 జరిమానా విధిస్తామని ప్లెక్సీల ద్వారా ప్రచారం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ ఆదేశాల మేరకు ప్రజలు గుమిగూడే ప్రాంతాల్లో ఈ ఫ్లెక్సీలను ఏర్పటు చేశారు. మాస్కులు తప్పక ధరించాలని, చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, భౌతికదూరం పాటించాలని, గుంపులుగా ఉండవద్దని పలు సూచనలు ఫ్లెక్సీలో ముద్రించారు. అలాగే 45 ఏళ్ల పైబడిన వారు వ్యాక్సీన్‌ వేయించుకోవాలని, కరోనా నుంచి రక్షణ పొందాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News