Tuesday, April 16, 2024

పవన్ కు ఏప్రిల్ 50 -50 !! వకీల్ సాబ్ ఏమవుతుందో ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. హిట్ ఫ్లాఫ్ లతో సంబంధంలేకుండా పవన్ ఫ్యాన్స్ సందడి చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవర్ స్టార్ చేస్తున్న సినిమా ఇదే. అయితే ఈ సినిమాపై అభిమానుల్లో కొత్తగా ఓ ఆలోచన మెదిలింది. గతంలో పవన్ కళ్యాణ్ ఏప్రిల్ నెలలో రిలీజ్ చేసిన సినిమాలు కొన్ని హిట్ కాగా మరికొన్ని తీవ్రంగా నిరాశ పరిచాయి.

ఆ సినిమాలను ఒక్కసారి చూసుకుంటే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బద్రి ఏప్రిల్ 20 2000న విడుదలైంది. అలాగే ఖుషి సినిమా ఏప్రిల్ 21 2001 న విడుదలైంది. అలాగే పవన్ కెరీర్ లో నిరాశపరిచిన జానీ చిత్రం ఏప్రిల్ 23 2003 న రిలీజ్ అయింది. కాగా ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఏప్రిల్ 8న 2016 లో విడుదలైంది. ఇక తీన్ మార్ ఏప్రిల్ 14 2011 న వచ్చింది. ఈ సినిమా కూడా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ఇక ఇప్పుడు ఏప్రిల్ 9న వకీల్ సాబ్ సినిమా రాబోతోంది. ఇక కెరీర్ పరంగా ఏప్రిల్ లో రిలీజ్ అయిన సినిమాలను చూసుకుంటే 50 శాతం హిట్లు 50 శాతం ఫ్లాప్ లు ఉన్నాయి. మరి ఈ సినిమా హిట్ ఫట్టో తెలియాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement