Friday, December 6, 2024

గణపతి నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి.. డీజేలు నిషేధం అన్న పోలీసులు

గణపతి నిమజ్జనోత్సవం కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు పెద్దపల్లి డీసీపీ రూపేష్ పేర్కొన్నారు. గురువారం నిమజ్జనోత్సవం నిర్వహించే మినీ ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం శోభాయాత్ర జరిగే ప్రాంతాలను పరిశీలించి కూడళ్ల వద్ద బందోబస్తు కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు సూచించారు. అనంతరం ఆయ‌న మాట్లాడుతూ.. నిమజ్జనం కోసం భారీ క్రేన్ ఏర్పాటు చేస్తున్నామని, ఉత్సవ కమిటీలు భక్తిశ్రద్ధలతో ఊరేగింపు జరుపుకోవాలన్నారు.

డీజేలు పెట్టేందుకు అనుమతి లేదని, ఊరేగింపు పై పూర్తిస్థాయి నిఘా ఉంటుందన్నారు డీసీపీ రూపేశ్‌. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఏసీపీ సారంగపాణి, సీఐలు ప్రదీప్ కుమార్, అనిల్ కుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement