Saturday, May 4, 2024

పిలిచే భక్తునికి – పలికే దైవం కాణిపాకం వినాయకుడు

భారతీయ సనాతన ధర్మానికి సంస్కృతికి దేవాల యాలు ప్రతిరూపాలు. ప్రాచీన కాలము నుండి ఆరాధన కలిగి పూజాధికములనందుకొనుచున్న దేవత సమూహమునందు విఘ్నేశ్వరుడు అగ్రగన్యుడు, సర్వ సిద్ధి ప్రదాత, విఘ్న వినాశకుడు, బుద్ధి ప్రదాతగాను వినాయకుడు ప్రసిద్ధిగాంచాడు. ‘వినాయకుడు’ అనే పదానికి నాయకుడు లేనివాడని అర్థం. వినాయకుడికి వేరే నాయకుడు లేడు. తనకు తానే నాయకుడు అందుకనే, పరమశివుడు ప్రమథ గణాలకు ఆధిపత్యాన్ని ఇచ్చి, వినాయకుని గణాధిపతిని చేశాడు. వినాయకుని వక్రతుండం నాదానికి మూలమైన ఓంకారాన్ని సూచిస్తుంది అందుకే ప్రతి మంత్రానికి ముందు ఓంకారా న్ని చేర్చి చదువుతుంటారు. ఇంతటి శక్తిమంతుడైన వినాయకుడు వివిధ రూపాల్లో దర్శనమిస్తుంటాడు. వినాయకుని పూజించేవారు వారి అభీష్టాన్ని అనుసరించి అందుకు తగిన రూపంలోనున్న వినాయ కుని పూజిస్తుంటారు. మనలను కార్యోన్ముఖులను చేసి తలపెట్టిన పనులను నిర్విఘ్నంగా పూర్తి చేయించి సంకల్ప సిద్ధిని ప్రసాదించే దైవం కాణిపాకం వరసిద్ధి వినాయకుడు. చిత్తూరుకు 12 కిలో మీటర్ల దూరంలో వున్న ‘కాణిపాకం’ క్షేత్రంలో వెలసిన వరసిద్ధి వినాయకుని లక్షలాదిమంది భక్తుల కోర్కె లు తీరుస్తున్నాడు. పిలిచే భక్తులకు పలికే దేవునిగా కొలువై వున్నాడు.
ఈ వినాయక స్వామికి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి (వినాయక చవితి పండుగ) ఈ సంవత్సరం ఆగస్టు 31వ తేదీ వినా యక చవితి నుంచి తొమ్మిదిరోజులపాటు జరిగిన నవరాత్రి బ్రహ్మోత్స వాలు నేటితో (8వతేదీ గురువారం) ముగుస్తాయి. రేపటినుంచి (శుక్ర వారం 9వ తేదీ) పన్నెండు రోజులపాటు సెప్టెంబర్‌ 20వ తేదీ వరకు ప్రత్యేక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి. బ్రహ్మోత్స వాల రోజుల్లో లక్షలాదిమంది భక్తులు స్వామి దర్శనానికి వస్తుంటారు. తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరుని తర్వాత కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకునికి మాత్రమే స్వర్ణ రథం ఉంది. ఈ దేవాలయాన్ని 12వ శతాబ్దంలో కుళోతుంగ చోళరాజు బ్రహ్మ హత్య పాతక నివృత్తి కోసం కట్టించినట్టు చరిత్ర చెప్తోంది.

వరసిద్ధి వినాయకస్వామి చరిత్ర

కాణిపాకంలో వినాయకస్వామి పుట్టుకకు ఓ చరిత్ర వుంది. ఇక్కడ ఆలయంలేని సమయంలో మూగ, గుడ్డి, చెవిటి అంగవైకల్యం కలి గిన ముగ్గురు అన్నదమ్ములు కలిసి చిన్న బావిలో ఏతం. తొక్కి, నీళ్లు తోడి పంటలు పండించుకుని జీవించేవారు.
ఒక రోజు ఏతం తొక్కుతూవుంటే బావిలో నీరు అయిపోగా, వారి లో ఒక వ్యక్తి బావిలోకి దిగి పారలో తవ్వితే రక్తం వచ్చిందట. ఆ ముగ్గురూ ఆ రక్తాన్ని తాకగా వారి అంగవైకల్యం పూర్తిగా పోయింది. చుట్టుపక్కల వున్న ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకుని బావిని తవ్వ గా, వరసిద్ధి వినాయకస్వామి మూలవిగ్రహం బయటపడింది. కానీ ఎంత తవ్వినా విగ్రహం మాత్రం పూర్తిగా బైటకిరాలేదు. ఇది చూసి భక్తులు కొట్టిన టెంకాయల నీరు ఒక ఎకరం పొలం పారింది. సంస్కృతంలో ‘కాణి’ అంటే ఎకరం, ‘పాకం’ అంటే టెంకా య నీరు అని, ఎకరా టెంకాయనీరు పారింది కనుక ‘కాణిపాకం’ అన్న పేరు గ్రామానికి సార్ధకం అయింది.
ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే కాణిపాకం గుడికి ప్రమాణానికి పిలుస్తా రు. తప్పు చేసినవారు తప్పు చేయలేదని. ప్రమాణంచేస్తే వారికి ఏదైనా అనర్థం జరుగుతుందని ప్రతీతి. అందుకే కాణిపాకం ఆలయం సత్య ప్రమాణాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వరసిద్ధి వినాయకుని సత్యప్ర మాణాల స్వామి అని పిలుస్తారు.
కాణిపాకానికి 12 కిలోమీటర్ల దూరంలో అర్థగిరిపై ఉన్న సంజీవ రాయ పుష్కరిణిలోని నీటిని భక్తులు 40 రోజులపాటు సేవించి పక్కనే ఉన్న ఆంజనేయస్వామిని దర్శిస్తే అన్ని వ్యాధులు తగ్గిపోతాయని భక్తు ల విశ్వాసం. ఆంజనేయస్వామి సంజీవిని పర్వతం తీసుకువస్తుండగా అందులో ఒక ముక్క జారి ఇక్కడ పడి అర్థగిరి అరిగిరి అయిందని భక్తుల నమ్మకం. వరసిద్ధి వినాయకుడు స్వయంభుగా వెలసిన బావి లోని జలాన్ని భక్తులు తీర్ధంగా స్వీకరిస్తారు. సంతానం లేని దంపతు లు, దీర్ఘవ్యాధులతో బాధపడుతున్నవారు కాణిపాకం వినాయకుని దర్శించుకుని 11 లేదా 22 లేదా 41 రోజులు నియమానుసారం పూజ లు చేస్తే సంతాన ప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందట. ఇక్కడ స్వామి దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నాడని భక్తుల నమ్మకం. 50 సంవత్సరాల క్రిందట స్వామివారికి చేయించిన వెండి కవచం నేడు స్వామివారికి సరిపోవటంలేదని, స్వామివారు ఆవిర్భవిం చినప్పుడు కనిపించని బొజ్జ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఇది స్వామి పెరుగుతూ ఉన్నాడనడానికి చక్కని నిదర్శనం. అందుకే స్వామి వారు స్వయంభునిగా ఖ్యాతి నొందారు. శివుడు విష్ణువు ఒకే పుణ్య క్షేత్రంలో అది ఒకే ప్రాంగణంలో ఉండడంతో కాణిపాకం క్షేత్రాన్ని శివ వైష్ణవ క్షేత్రంగా పిలుస్తారు. వినాయకుని దర్శనం ‘పాదాది కేశనం’ అన్నారు. ముందు పాదాలను దర్శించి అక్కడి నుండి కేశాల వరకు దర్శించాలి. వరసిద్ధి వినాయకుని సేవించడం వల్ల విద్యా ప్రాప్తి వివాహ ప్రాప్తి సంతాన ప్రాప్తి సర్వ అభీష్ట సిద్ధి కలుగుతాయి.

  • రసస్రవంతి, కావ్యసుధ 9247313488
Advertisement

తాజా వార్తలు

Advertisement