Wednesday, April 24, 2024

చిత్ర‌గుప్తుడిగా అజ‌య్ దేవ‌గ‌న్.. థ్యాంక్ గాడ్ ఫస్ట్ లుక్ రిలీజ్

అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హోత్రా క‌లిసి న‌టించిన బాలీవుడ్ అప్ క‌మింగ్ మూవీ ధ్యాక్యూ గాడ్. ఇంద్ర కుమార్ దర్శకత్వం వహించిన థాంక్స్ గాడ్ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమాకి సంబ‌ధించి ఫస్ట్ లుక్ పోస్ట‌ర్ ను రిలీజ్ చేశారు మేక‌ర్స్. నటీనటులు కూడా తమ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్స్‌లో తమకు సంబంధించిన పోస్టర్లను షేర్ చేశారు. #ThankGod సిన‌మా ట్రైలర్ రేపు విడుద‌ల కానున్న‌ట్టు క్యాప్ష‌న్స్ లో రాశారు యాక్ట‌ర్స్. కాగా, ఈ సినిమా అక్టోబర్ 25న థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది. పోస్టర్‌లో, అజయ్ దేవగన్ మంచి బియ‌ర్డ్ లుక్ (గడ్డం)తో బంగారు సింహాసనంపై సూట్ ధరించి కూర్చున్నట్లు చూడవచ్చు. ఈ మూవీలో అజ‌య్ దేవ‌గ‌న్ చిత్రగుప్తుడి క్యారెక్ట‌ర్ లో నటించనున్నారు. అదేవిధంగా, ఈ సినిమాలో సామాన్యుడి పాత్రను పోషిస్తున్నడు సిద్ధార్థ్ మల్హోత్రా.

Advertisement

తాజా వార్తలు

Advertisement