Friday, May 3, 2024

TS: ఎస్ఆర్ఆర్ కళాశాల అధ్యాపకుడు అందె శ్రీనివాస్ కు ఓయూ డాక్టరేట్ ప్రధానం

కరీంనగర్ పట్టణంలోని స్థానిక ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కళాశాలలోని కంప్యూటర్ సైన్స్ విభాగంలో అధ్యాపకుడుగా పనిచేసున్న అందె శ్రీనివాస్ కు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రధానం చేశారు. “ఆటోమేటిక్ బ్రెయిన్ స్ట్రోక్ క్లాస్ఫికేషన్ అండ్ డిటెక్షన్ యుసింగ్ ఏఐ బేస్డ్ డేటా మైనింగ్ టెక్నిక్స్“ అనే అంశం పై ప్రొఫెసర్ డాక్టర్. జోసెఫ్ పి. మోసిగంటి పర్యావేక్షణలో ఈ పరిశోధన చేసినట్లు తెలిపారు.

డాక్టర్ అందె శ్రీనివాస్ పిహెచ్డి పట్టా పొందిన సందర్భంగా తమ గైడ్ ప్రొఫెసర్ డాక్టర్. జోసెఫ్ పి. మోసిగంటి,స్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్. ఎం వెంకటదాస్ ను కలిసి వారియొక్క ఆశీస్సులు తీసుకొన్నారు. ఈ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రామకృష్ణ , జి.సి.జి.టి.ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె. సురేందర్ రెడ్డి , స్టాఫ్ క్లబ్ సెక్రెటరీ డాక్టర్ అడెపు శ్రీనివాస్ , వైస్ ప్రిన్సిపాల్ రాజయ్య, ప్రమోద్ కుమార్ , డాక్టర్ మల్లారెడ్డి , డాక్టర్ యస్.ఓ. కుమార్ , డాక్టర్ టి. మహేష్, యమ్. ఆంజనేయులు తదితర అధ్యాపకులు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement