Friday, May 17, 2024

Jampanna Vagu Tragedy – నాలుగు మృతదేహాలు లభ్యం … మరో ముగ్గురి కోసం గాలింపు


ఏటూరునాగారం,జూలై 28 (ప్రభ న్యూస్): మండలంలోని కొండాయి గ్రామంలో జంపనవాగు వరద ఉద్ధృతిలో ప్రమాదవశాత్తు గురువారం కొట్టుకుపోయిన నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. వాగు ఉధృతి శాంతించడంతో పంట చేల్లో మృతి చెందిన దేహాలు లభ్యమయ్యాయి.

కాగా, ములుగు జిల్లాలో జంపన్నవాగు ఉధృతంగా మారింది. ఏటూరు నాగారం మండలం కొండాయి, మాల్యాల గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. దీంతో వందలాది మంది గ్రామంలోనే చిక్కుకునిపోయారు. వారిని కాపాడేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే వరద ఉధృతి కారణంగా గ్రామంలోకి వెళ్లలేకపోతున్నామని చెబుతున్నాయి NDRF బృందాలు. ఇక నిన్న జంపన్న వాగులో గల్లంతైన ఏడుగురు గల్లంతయ్యారు.. వాటిలో నేడు నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి.. … మరో ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement