Sunday, April 28, 2024

MBNR : నామినేషన్ దాఖలు చేసిన బిజెపి అభ్యర్థి జలంధర్ రెడ్డి

మక్తల్, నవంబర్ 10 ( ప్రభన్యూస్): అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నారాయణ పేట జిల్లా మక్తల్ అసెంబ్లీ స్థానానికి బిజెపి మ్మెల్యే అభ్యర్థిగా మాదిరెడ్డి జలంధర్ రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారి మియాంక్ మిత్తాల్ కు ఒక సెట్ నామినేషన్ పత్రాలు అందజేశారు. పట్టణంలో పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీగా తరలివచ్చారు.

మాజీ ఎంపి బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎపి.జితేందర్ రెడ్డి, మాజీ ఎంపిపి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య, పార్టీ జిల్లా అధ్యక్షుడు పగడాకుల శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.భాస్కర్ తో కలిసి బిజెపి అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ లో బిజెపి ప్రభుత్వం రాబోతోందని అన్నారు. అంతకు ముందు పట్టణంలోని శ్రీ పడమటి ఆంజనేయస్వామి దేవాలయం శ్రీ నల్లజానమ్మ దేవాలయంలో పార్టీ నాయకులతో కలిసి బిజెపి అభ్యర్థి మాదిరెడ్డి జలంధర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement