Tuesday, April 30, 2024

సీజనల్ నాయకుడు మధుయాష్కీ

మాజీ ఎంపీ మధుయాష్కీ కాలంకి ఒకసారి వచ్చే వ్యక్తి అని, నిరంతరం ప్రజల్లో ఉండే ఎమ్మెల్సీ కవిత ను విమర్శించే నైతిక హక్కు ఏ మాత్రం లేదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే నీళ్లు, నిధులు,నియామకాలు కోసమని,తాగు,సాగు నీటి కోసం ముఖ్యమంత్రి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారన్నారు. 5 వేల కోట్లతో మిషన్ కాకతీయ ద్వారా ప్రతి నీటిబొట్టుని ఒడిసి పట్టి సాగునీటిని అందించారని,నియోజకవర్గంలో సైతం నాలుగు కోట్లతో అనేక గ్రామాల్లో చెక్ డ్యాంలు నిర్మించామన్నారు. ప్రపంచమే అబ్బురపడేలా కాళేశ్వరం కట్టిన ఘనుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. గడిచిన ఏడు సంవత్సరాల కాలంలో కేంద్రం ఒక్క గోదాం కట్టలేదని విమర్శించారు. సంవత్సర కాలంలో సీజన్ వారిగా కనపడే నాయకుడు మధుయాష్కీ అని,ఆయన ఏం అభివృద్ధి చేసాడో అందరికి తెలుసన్నారు. ఎమ్మెల్సీ కవిత ఎంపీగా ఉన్న సమయంలో పసుపు బోర్డ్ కోసం ఎక్కని మెట్టు లేదు, కలవని ముఖ్యమంత్రులు లేరని గుర్తు చేశారు.

నిజామాబాద్ చెరుకు ఫ్యాక్టరీ కోసం మదుయాష్కి ఎంపీగా ఉన్నపుడు ఏం చేశారని ప్రశ్నించారు. నిరంతరం ప్రజల్లో ఉండే ఎమ్మెల్సీ కవితను కాలంకి ఒకసారి వచ్చే మాధుయాష్కీకి విమర్శించే హక్కు లేదన్నారు. వీలైతే రాహుల్ గాంధీతో మాట్లాడి రైతుల పక్షాన నిలవాలసిందిగా కోరాలని హితవు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement