Monday, April 29, 2024

TS: భూముల‌కు సాగునీరందించండి.. మంత్రి ఉత్తమ్ ను కోరిన ఎమ్మెల్యేలు

మక్తల్, జనవరి 29 (ప్రభ న్యూస్) : జీవో 69 అమలు చేసి నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకం చేపట్టి నారాయణపేట, కొడంగల్, మక్తల్ నియోజకవర్గాల్లోని భూములకు సాగునీరందించాల‌ని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి వినతిపత్రం సమర్పించారు. ఇవాళ హైదరాబాద్ డాక్టర్ బి ఆర్ అంబేద్క‌ర్ రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఉత్తమ్ ని కలిసిన ఎమ్మెల్యేలు కొడంగల్, నారాయణ పేట, మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని కరువు పీడిత ప్రాంతాలకు సాగునీటి సౌకర్యం కల్పించేందుకు నారాయణ పేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ జీఓ 69ని అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 23మే 2014 న అనుమతినిచ్చిందని మంత్రికి ఎమ్మెల్యేలు వివరించారు.

అయితే ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుకు అన్నివిధాలా అనుమతులున్నా గత అసమర్ధ బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందదని, ఈ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలని మంత్రికి విన్నవించారు. నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసిన వారిలో మక్తల్, నారాయణ పేట ఎమ్మెల్యేలతో పాటు సిడబ్యుసి ప్రత్యేక ఆహ్వానితులు వంశీ చంద్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యేన్నేం శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు శివకుమార్ రెడ్డి ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement