Friday, May 17, 2024

9న ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల

హైద‌రాబాద్ : ఈ నెల 9వ తేదీన‌(మంగ‌ళ‌వారం) ఇంట‌ర్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌రం ఫ‌లితాలు విడుద‌ల‌ కానున్నాయి. మంగ‌ళ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు నాంప‌ల్లిలోని ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డులో ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఎగ్జామ్స్ మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌రం ప‌రీక్ష‌ల‌కు ఐదు ల‌క్షల మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు. ఇంట‌ర్ ఫ‌లితాల కోసం ntnews.com, tsbie.cgg.gov.in అనే వెబ్‌సైట్ల‌ను లాగిన్ చేసి చూడవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement