Tuesday, April 30, 2024

నాన్ ట్రైబల్ రైతులకు ఎలాంటి ఇబ్బందులుండవు: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ భ‌రోసా

ఉట్నూర్ జూన్26( ప్రభన్యూస్) అదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో సాగు చేసుకుంటున్నా నాన్ ట్రైబల్ రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని దేవాదాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అసిఫాబాద్ జిల్లా పర్యటనకు వెళ్తున్న క్రమంలో ఉట్నూర్ ఎక్స్ రోడ్ వద్ద జాధవ్ శ్రీరామ్ నాయక్ నివాసానికి మంత్రి రావడంతో ఆయ‌న‌కు మాజీ మంత్రి వర్యులు గోడం నగేష్, శ్రీరామ్ లు బొకే అందించి ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మంత్రి కి విన్నవిస్తూ ఏజెన్సీలో ఉన్న నాన్ ట్రైబల్ పోడు భూముల గురించి మాట్లాడటంతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ ట్రైబల్ కుఇఛ్చినట్టు పట్టాలు ఇవ్వలేమ‌ని, కానీ గిరిజనేతర రైతులకు సంబంధించిన భూములకు రక్షణ ఉంటుందని తెలిపారు. ఇంతకు ముందులాగా ఎవ్వరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ శ్రీరామ్ ఎంపీపీ పంద్రా జైవంత్ రావు వైస్ ఎంపీపీ డావులే బాలాజీ బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు ధాసండ్ల ప్రభాకర్,బి ఆర్ ఎస్ వి జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్ బి ఆర్ ఎస్ వి మండల అధ్యక్షులు తన్నీరు సతీష్.స్వామి. నరేందర్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement