Sunday, April 28, 2024

వీర‌నారి ఐల‌మ్మ కాంస్య విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ‌.. బ‌హిరంగ స‌భ ప‌నుల‌కు భూమి పూజ‌

ఉమ్మడి మెదక్ బ్యూరో (ప్రభ న్యూస్): సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు నియోజకవర్గం చిట్కుల్ గ్రామంలో తెలంగాణ వీరవనిత చాకలి ఐల‌మ్మ అతి పెద్ద కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వ‌హిస్తున్నారు. ఈ విగ్రహావిష్కరణ సందర్బంగా 30 వేల మందితో టిఆర్ ఎస్ రాష్ట్ర నాయకుడు, చిట్కుల్ సర్పంచ్ నీలం మధు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇవ్వాల (శనివారం) భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్బంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ రజాకార్ల దాష్టీకంపై పిడికిలి బిగించి పోరాడి, తెలంగాణ పౌరుషాన్ని చాటిన వీర వనిత స్వర్గీయ చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించడం తన అదృష్టంగా భావిస్తున్నా అన్నారు.

నైజాం నవాబు సేనల అణచివేత నడుమ ఓ వీరనారి పోరాడి ఔరా అనిపించిందని, ఆమె స్ఫూర్తితో నాడు గ్రామ గ్రామాన విప్లవ జ్వాలలు ఎగిసిపడ్డాయన్నారు టీఆర్ ఎస్ నేత నీలం మ‌ధు ముదిరాజ్‌. ఇలాంటి వీర వనితను స్మరించుకునేందుకు రాష్ట్రంలో అత్యంత ఎతైన విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమానికి ఐటీ, మున్సిపల్ శాఖల‌ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు , ఆర్థిక మంత్రి హరీష్ రావుతో పాటు ఇత‌ర‌ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, జాతీయ రజక సంఘ నాయకులు హాజరవుతున్నారన్నారు.

కార్యక్రమాన్ని పురస్కరించుకుని భారీ బైక్ ర్యాలీ, ఇతర సాంస్కృతిర‌ కార్యక్రమాలు నిర్వ‌హిస్తున్నామ‌ని, దీనికి పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్న‌ట్టు తెలిపారు. అన్ని హంగులతో బహిరంగ సభ నిర్వహిస్తున్నామ‌ని చెప్పారు. కార్యక్రమానికి పఠాన్ చెరు నియోజకవర్గం నుండి సబ్బండ వర్గాలు తరలివచ్చి విగ్రవిష్కరణ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని నీలం మధు ముదిరాజ్ పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement