Monday, April 29, 2024

ADB: ధర్మ పరిరక్షణలో కంకణ బద్దులు కావాలి.. కంచి కామకోటి పీఠాధిపతి

ప్రభ న్యూస్, బ్యూరో ఉమ్మడి ఆదిలాబాద్, డిసెంబర్ 11 : ప్రజల విశ్వాసాన్ని చూరగొoటూ ధర్మస్థాపన, జాతి పరిరక్షణ కోసం పాటుపడాలని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి, హిందూ దేవాలయాల జీర్ణోద్ధరణ సమితి వ్యవస్థాపకులు శ్రీ కమలానంద భారతి ఉద్భోదించారు. చతుర్మాస దీక్ష పురస్కరించుకొని కాశీలో జరిగిన రుద్రయాగం, చండీహోమం కార్యక్రమం అనంతరం తిరుగు ప్రయాణంలో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి అదిలాబాదులోని శ్రీ రామాలయంలో బస చేశారు. ఇవాళ ఉదయం నూతనంగా గెలిచిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ విజయేంద్ర సరస్వతి స్వామీజీ ఆశీస్సులు పొందారు.

ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ… ధర్మరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని హిత బోధ చేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేకు ఆశీస్సులు అందించారు. ఆ తర్వాత హిందూ దేవాలయాల జీర్ణోద్ధరణ సమితి అధ్యక్షులు శ్రీ కమలానంద భారతి స్వామీజీని ఎమ్మెల్యే పాయల్ శంకర్ కలుసుకొని ఆశీస్సులు పొందగా, ధర్మం కోసం, న్యాయం కోసం, జాతి పరిరక్షణ కోసం, పాటుపడాలని ప్రజల సంక్షేమం కోసం సేవలందించాలని సూచించారు. కమలానంద భారతి 20ఏళ్ల కిందట అదిలాబాద్ పూర్వ జిల్లాలో ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా పనిచేశారు. ఈ ప్రాంతం సంఘ పరివార్, బీజేపీ నాయకులతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

జైనథ్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే పూజలు..
కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా జైనథ్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీజేపీ నేతలతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ కమిటీ తరఫున అర్చకులు పాయల శంకర్ ను ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు ఆదినాథ్, కౌన్సిలర్లు ఆకుల ప్రవీణ్, జోగు రవి, లోక ప్రవీణ్ రెడ్డి, జైనథ్ మండల అధ్యక్షుడు కటకం రాందాస్, బోయర్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement