Monday, April 29, 2024

Exclusive | అలా నిరూపించకుంటే రేవంత్​ పీసీసీ పదవి వదులుకోవాలి.. మంత్రి శీనన్న సవాల్!

ఎన్నికల అఫిడవిట్​ ట్యాంపరింగ్​కు పాల్పడ్డారన్న కోర్టు తీర్పుపై మంత్రి శ్రీనివాస్​గౌడ్ ఇవ్వాల (మంగళవారం) స్పందించారు ​.. ఎన్నికల అఫిడవిట్​లో తప్పు జరగలేదని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందన్నారు. నామినేషన్​ వేసేటప్పుడు నాలుగు సెట్ల పత్రాలు ఇస్తామని, కొందరు క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ కేసుపై ఎక్కడా మాట్లాడొద్దని పిటిషనర్​కు కోర్టు చెప్పిందని, అయినా అవాకులు, చెవాకులు పెలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక.. రేవంత్​ రెడ్డి ఓ బ్లాక్​ మెయిలర్​ అని, పదవి వచ్చినా అతని​ బుద్ధి మాత్రం మారలేదని మంత్రి శ్రీనివాస్​ గౌడ్ మండిపడ్డారు​. బడా బాబులను బెదిరించి వందల కోట్లు సాంపాదించాడని, తాను ఇంచు భూమి కబ్జా చేశానని నిరూపిస్తే దేనికైనా రెడీ సిద్ధమేనన్నారు. లేదంటే రేవంత్​ రెడ్డి పీసీసీ పదవి వదులుకుంటారా? అని సవాల్ విసిరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement