Monday, May 20, 2024

ఛాంపియన్‌షిప్స్‌ 2024 కోసం వింబుల్డన్‌ పబ్లిక్‌ బ్యాలెట్‌ ప్రారంభం

హైదరాబాద్‌ : ది ఛాంపియన్‌షిప్స్‌ 2024 కోసం వింబుల్డన్‌ పబ్లిక్‌ బ్యాలెట్‌ను జూలై 1-14 వరకు నిర్వహిస్తున్నామని ఆల్‌ ఇంగ్లాండ్‌ లాన్‌ టెన్నిస్‌ క్లబ్‌ ప్రకటించింది. వింబుల్డన్‌ పబ్లిక్‌ బ్యాలెట్‌ దరఖాస్తులను సెప్టెంబరు 26 మంగళవారం 23.59 బ్రిటిష్‌ సమ్మర్‌ టైమ్‌ (బీఎస్‌ టీ) నుంచి అక్టోబర్‌ 10 మంగళవారం వరకు 15 రోజుల వ్యవధిలో చేసుకోవలసి ఉంటుది. ఈ సందర్భంగా ఆల్‌ ఇంగ్లాండ్‌ క్లబ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సాలీ బోల్టన్‌ మాట్లాడుతూ… గత 100 ఏళ్లలో ఛాంపియన్‌షిప్‌లు చాలా అభివృద్ధి చెందినప్పటికీ, టిక్కెట్ల కోసం వింబుల్డన్‌ పబ్లిక్‌ బ్యాలెట్‌ను నిర్వహించే సంప్రదాయం కొనసాగుతుందన్నారు. టికెటింగ్‌కు తమ విధానంలో ఇది ఒక ప్రత్యేక అంశంగా మిగిలిపోయిందన్నారు. ఈ ఏడాది రికార్డు ఆసక్తికి అనుగుణంగా ఇప్పుడు ఛాంపియన్‌షిప్స్‌ 2024 కోసం ఎదురుచూడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

మాజీ వింబుల్డన్‌ ఛాంపియన్‌ లియాండర్‌ పేస్‌ మాట్లాడుతూ… ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెన్నిస్‌ అభిమానులకు వింబుల్డన్‌ అనేది పుణ్యక్షేత్రమన్నారు. వింబుల్డన్‌ పబ్లిక్‌ బ్యాలెట్‌ ప్రతి ఒక్కరికీ ఛాంపియన్‌షిప్‌ల టిక్కెట్‌లను పొందేందుకు సమాన అవకాశాన్ని ఇస్తుందన్నారు. ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన -టె-న్నిస్‌ వేదికపై ఆడినప్పటి చాలా మధురమైన జ్ఞాపకాలు తనకు ఉన్నాయన్నారు. అంకిత రైనా మాట్లాడుతూ… ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి టెన్నిస్‌ అభిమానికి వింబుల్డన్‌ ప్రత్యక్షంగా చూడటం ఒక కల సాకారమవుతుందన్నారు. వింబుల్డన్‌ పబ్లిక్‌ బ్యాలెట్‌ టిక్కెట్ల కోసం డ్రాలో ప్రవేశించడానికి మీకు ఈ అవకాశాన్ని ఇస్తుందన్నారు. దరఖాస్తును చేసుకోవాలని మిమ్మల్ని తాను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement