Sunday, April 28, 2024

గొంతు నొప్పి త‌గ్గించేందుకు తుల‌సి కాఫ్ డ్రాప్స్ లాంచ్ చేసిన విక్స్

గొంతు నొప్పిని త‌గ్గించేందుకు విక్స్ సంప్ర‌దాయ చిట్కా అయిన తుల‌సి కాఫ్ డ్రాప్స్ ను లాంచ్ చేసింది. ఈసంద‌ర్భంగా ప్రోక్ట‌ర్ అండ్ గ్యాంబుల్ ఇండియా సీనియ‌ర్ డైరెక్ట‌ర్, కేట‌గిరీ హెడ్ సాహిల్ సేథి మాట్లాడుతూ…. విక్స్ కాఫ్ డ్రాప్స్ వినియోగ‌దారుల‌కు గొంతుగ‌ర‌గ‌ర‌కి ఉప‌శ‌మ‌నం క‌లిగించేందుకు స‌హ‌జ‌, సంప్ర‌దాయ ప‌దార్థాల ఆధారిత రుచుల‌ను ఉప‌యోగిస్తోంద‌న్నారు. తుల‌సి దాని ఔష‌ధ ల‌క్ష‌ణాల‌కు భార‌తీయ గృహాల్లో ఎక్కువ‌గా ఉప‌యోగించే మూలిక అన్నారు. అందువ‌ల్ల విక్స్ కాఫ్ డ్రాప్స్ శ్రేణికి తుల‌సిని కొత్త అద‌నంగా ప‌రిచ‌యం చేయాల‌నుకుంటున్నామ‌న్నారు. దీని ద్వారా త‌మ వినియోగ‌దారుల‌కు వారి గొంతునొప్పికి స‌మ‌ర్థ‌వంత‌మైన ప‌రిష్కారాన్ని అందించే త‌మ నైతిక‌త‌కు తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌న్నారు. గ‌ర‌గ‌ర లేకుండా సుల‌భంగా మాట్లాడేందుకు వినియోగ‌దారుల‌కు విక్స్ తుల‌సి కాఫ్ డ్రాప్స్ ఒక ఇంటి చిట్కా అవుతుంద‌ని తాము న‌మ్ముతున్నామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement