Friday, March 29, 2024

ఐటెం సాంగ్స్‌లో న‌టించే అవ‌కాశం వ‌స్తే చేస్తారా అంటే.. సాయిప‌ల్ల‌వి ఏమందో తెలుసా?

కెరీర్ ప్రారంభం నుంచి డిఫ‌రెంట్ రోల్స్ ప్లే చేస్తూ.. టాలెంటెడ్ యాక్ట్రెస్‌గా సాయి పల్లవి గుర్తింపు తెచ్చుకుంది. ఒక నటిగా తొలి నుంచి ఆమె కొన్ని పరిధులను విధించుకుంది. గ్లామర్ పాత్రలకు, ఎక్స్ పోజింగ్ కు దూరంగా ఉంటూ వ‌స్తోంది. ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ ఆమె స్కిన్ షో చేయలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఐటెం సాంగుల గురించి అడిగిన ఒక ప్రశ్నకు సాయిపల్లవి తనదైన శైలిలో సమాధానమిచ్చింది.

‘పుష్ప’ చిత్రంలో ‘ఊ అంటావా మామ’ పాట, ‘రంగస్థలం’ సినిమాలో ‘జిగేలు రాణి’ వంటి ఐటెం సాంగ్స్ లో అవకాశం వస్తే నటిస్తారా? అనే ప్రశ్న ఆమెకు ఎదురయింది. దీనికి సమాధానంగా.. త‌ను అట్లాంటి పాత్ర‌ల్లో న‌టించ‌న‌ని తేల్చి చెప్పింది ఈ భామ‌. ఐటెం సాంగులు తనకు కంఫర్ట్ గా ఉండవని తెలిపింది. అలాంటి వాటిలో అవకాశం వచ్చినా చేయనని చెప్పేస్తానని స్పష్టం చేసింది. వస్త్రధారణ సరిగా లేకపోతే తనకు చాలా ఇబ్బందిగా ఉంటుందని.. అట్లాంటి పాటలు చేయాలనే ఆసక్తి కూడా తనకు లేదని తెలిపింది. జీవితానికి కెరీర్ ఎంత ముఖ్యమో, ప్రేమ కూడా అంతే ముఖ్యమని.. రెండింటిలో ఏది లేకపోయినా జీవితం సంపూర్ణం కాదని చెప్పింది ఈ డాక్ట‌ర్ బ్యూటీ..

Advertisement

తాజా వార్తలు

Advertisement