Wednesday, May 1, 2024

HYD : బిఆర్‌ఎస్​కు ఓటు వేసి గెలిపించండి… ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

కర్మన్ ఘాట్, నవంబర్ 6 (ప్రభ న్యూస్): రాబోయే తరాలకు ఉపయోగపడే విధంగా ఎల్బీనగర్ నియోజకవర్గం అభివృద్ధి చేస్తున్నట్లు బి ఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడు పోనుగోటి రామ్మోహన్రావు ఆధ్వర్యంలో చంపపేట్ డివిజన్ పరిధిలోని డిఫెన్స్ కాలనీ పార్కులో డిఫెన్స్ కాలనీ, ఎస్వి కాలనీ, దుర్గా నగర్ కాలనీ ,మాధవ నగర్ కాలనీ వాసులతో సోమవారం ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బారాస సీనియర్ నాయకులు వేంరెడ్డి నరసింహారెడ్డి, ముద్దగొని రామ్మోహన్ గౌడ్, గజ్జల మధుసూదన్ రెడ్డి ,కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం చైర్మన్ నల్ల రఘు మారెడ్డి తో కలిసి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజకవర్గం రాబోయే తరాలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రోజురోజుకు వాహనాలు పెరుగుతుండటంతో వాటిని అనుగుణంగా ట్రాఫిక్ నియంత్రణ కోసం చంపాపేట్, హస్తినాపూర్ లో ఫ్లై ఓవర్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. బై రామల్ గూడ ,ఎల్బీనగర్ చౌరస్తాలో ఫ్రీ సిగ్నల్ ఏర్పాటుకు ఫ్లైఓవర్ అండర్పాస్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా నియోజకవర్గంలో స్మశాన వాటిక నిర్మాణం తో పాటు పార్కులను నిర్మించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మూడవసారి కెసిఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అన్నారు. ప్రతినిత్యం ప్రజల కోసం పనిచేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ 70 శాతం అభివృద్ధి పూర్తయిందని మరో 30 శాతం చేయాల్సి ఉందని దాన్ని కూడా వచ్చే ఐదు సంవత్సరాల్లో పూర్తి చేయటంతో పాటు నియోజకవర్గ చివరి ప్రాంతాల అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. నియోజకవర్గంలో కాలనీలు తెలవని నాయకులు వచ్చి ఏం అభివృద్ధి చేస్తారని ఆయన అన్నారు. కేంద్రము సహకరించక పోయిన రాష్ట్రాన్ని భారతదేశంలోని అగ్రగామి రాష్ట్రంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేశారని తెలిపారు పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ నిజాంబాద్ లో అభివృద్ధి చేయని నాయకుడు ఎల్ బి నగర్ లో ఏం చేస్తాడని మధు యాష్కి పై విరుచుకుపడ్డారు. కులాలు మతాలకు అతీతంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పనిచేస్తున్నట్లు తెలిపారు. బిజెపి అభ్యర్థికి ఏ కాలనీ ఎక్కడుందో తెలియదన్నారు. వచ్చే ఎన్నికల్లో సుధీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుంకోజ్ కృష్ణమాచారి వివిధ కాలనీలో అధ్యక్షులు జైపాల్ రెడ్డి, కంచర్ల వెంకటరెడ్డి, దుర్గ నగర్ కాలనీ అధ్యక్షులు యాదగిరి రెడ్డి, వంగ జగన్నాథరెడ్డి, దేవాలయ ధర్మకర్తలు బిల్ల కంటి కిరణ్ కుమార్ గుప్తా, గోగిరెడ్డి అంజిరెడ్డి, సురేందర్ రెడ్డి, ముడుపు రాజిరెడ్డి, రోజారెడ్డి, నిషి కాంత్ రెడ్డి గౌతమ్ రెడ్డి బెనర్జీ ,యాదగిరి ,గోగు శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement