Monday, May 6, 2024

TS: రేపు పెద్దపల్లికి సీఎం కేసీఆర్..

పెద్దపల్లి, అక్టోబర్ 6 (ప్రభ న్యూస్‌): నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిన అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రేపు (మంగళవారం) పెద్దపల్లికి రానున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున స్వాగత తోరణాలు ఏర్పాటు చేస్తున్నారు. పట్టణం గులాబీ మయంగా మారింది. పెద్ద ఎత్తున రాజీవ్‌ రహదారిపై హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు.

జూనియర్‌ కాలేజీ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గం లోని అన్ని మండలాల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ బహిరంగ సభ కోసం పెద్దపల్లికి తరలించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. జూనియర్‌ కాలేజీ మైదానంలో ఏర్పాట్లను, పట్టణ అలంకరణ పనులను ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రజలు తెలంగాణ ప్రదాత సీఎం కేసీఆర్ హాజరయ్యే బహిరంగ సభకు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే దాసరి కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement