Thursday, May 2, 2024

హైకోర్టు మొట్టికాయల‌తో రాత్రి కర్ఫ్యూ పెట్టి చేతులు దులుపుకున్నారు: విజ‌య‌శాంతి

హైద‌రాబాద్ – క‌రోనా నియంత్ర‌ణ‌పై హైకోర్టు వేసిన మొట్టికాయల‌తో రాత్రి క‌ర్ఫ్యూ పెట్టి కెసిఆర్ చేతులు దులుపుకున్నారంటూ బిజెపి నేత విజ‌య‌శాంతి విమ‌ర్శించారు.. ఈ మేర‌కు ఆమె వ‌రుస ట్విట్ లు చేశారు.. సరిగ్గా కిందటేడాది ఏం తప్పులు జరిగాయో… అవే ఇప్పుడూ పునరావృతం అవుతున్నందువల్లే రాష్ట్రంలో కరోనా సెకెండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చిందనే విషయాన్ని సర్కారు గ్రహించడం లేద‌ని,, గుణపాఠం నేర్చుకోవడం లేద‌ని టిఆర్ ఎస్ స‌ర్కార్ ను ఎత్తిపొడిచారు…రాత్రివేళ కర్ఫ్యూ పెట్టి చేతులు దులుపుకున్నారు కానీ, పగటి పూట ఎలాంటి నియంత్రణలూ లేకుండా ఈ ప్రభుత్వం సాధించదలుచుకుంది ఏమిటో అర్థం కావడం లేదంటూ విజ‌య‌శాంతి ఎద్దేవా చేశారు.. . ఈ నేతలను, ఈ సర్కారును నమ్ముకుంటే ఇంతే సంగతులని జనానికి బాగా అర్థమయ్యేలా చేస్తున్నారంటూ ఆమె మండిప‌డ్డారు. కాగా, కరోనా బారిన పడిన సీఎం కేసీఆర్ గారు అంతకుముందు మాస్క్ లేకుండా సమీక్షలు నిర్వహించి, సభల్లో పాల్గొన్న ఫొటోలు మీడియాలోను, సోషల్ మీడియాలోను చక్కర్లు కొడుతున్నాయని అన్నారు… తెలంగాణలో మాస్కులు ధరించనివారికి వేలకు వేలు ఫైన్లు వేస్తున్నార‌ని, . ఆ ఫైన్ ఏదో మాస్కు ధరించని కేసీఆర్ గారికి, ఆ పార్టీ నేతలకు కూడా వేసి ఉంటే ఇప్పుడు కెసిఆర్ క‌రోనా భారీన ప‌డి ఉండే వారు కాద‌న్నారు… పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు వారి అధినేత బాటలోనే నడుస్తూ నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారి క‌రోనా వ్యాప్తికి కార‌క‌ల‌వుతున్నారంటూ విజ‌య‌శాంతి ఫైర్ అయ్యారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement