Tuesday, May 30, 2023

నిరుపేద అమ్మాయిల పెళ్లిళ్లకు ఉప్పల ఫౌండేషన్ చేయూత!

ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు చెందిన ఇద్దరు అమ్మాయిల పెళ్లిళ్లకు మంగళసూత్రం, మెట్టెలు, చీర, గాజులు విరాళంగా అందజేసి చేయూతనందించారు. హైదరాబాద్ లోని నాగోల్ లో ఉప్పల శ్రీనివాస్ గుప్తా క్యాంప్ కార్యాలయంలో రసూల్ పురా, బీసీ – డి మరాఠీ కమ్యూనిటీకి చెందిన అమ్మాయి దీపిక వివాహం కోసం ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్, ఉప్పల ఫౌండేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మంగళ సూత్రం, మెట్టెలు, చీర, గాజులు, 100 కేజీల బియ్యం అందజేశారు.

- Advertisement -
   

అలాగే జహీరాబాద్ కి చెందిన అమ్మాయి, పేద బ్రాహ్మణ, నిరుపేద కుటుంబానికి చెందిన విఠల్ రావు కులకర్ణి కూతురు వైష్ణవి వివాహం సందర్భంగా.. మంగళ సూత్రం, మెట్టెలు, చీర, గాజులు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో.. పెళ్లి కూతుర్లు ఇద్దరు, వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, ఆనంద్ గుప్తా బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, ఆర్యవైశ్య నాయకులు, తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement