Wednesday, May 22, 2024

ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌ 2022లో పాల్గొన్న‌ మూడు వేల మంది

ఇనార్బిట్‌ మాల్‌ హైదరాబాద్‌ తమ రెండవ ఎడిషన్‌ ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌ 2022ను ఆదివారం దుర్గం చెరువు కేబుల్‌ వంతెన దగ్గర విజయవంతంగా నిర్వహించింది. స్పోర్ట్స్‌ బ్రాండ్‌ పూమా మద్దతుతో నిర్వహించిన ఈ సంవత్సరపు 21కెరన్‌కు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, ఐపీఎస్‌, జెండా ఊపి ప్రారంభించగా, 10కెరన్‌కు తెలంగాణా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య (ఐ అండ్‌ సీ) ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) శాఖల ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, ఐఏఎస్‌, 5కె రన్‌కు తెలంగాణా రాష్ట్ర, పురపాలక, నగరాభివృద్ధి శాఖల ప్రత్యేక కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌, ఐఏఎస్‌లు జెండా ఊపి ప్రారంభించారు. దివ్యాంగుల కోసం నిర్వహించిన మారథాన్‌కు స్త్రీ, మహిళ, దివ్యాంగ, సీనియర్‌ సిటిజన్‌ శాఖల సెక్రటరీ, కమిషనర్‌ దివ్య దేవరాజన్‌, ఐఏఎస్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంవత్సరపు ఐడీసీఆర్‌ –2022లో విభిన్న వర్గాలు, వయసు విభాగాలకు చెందిన దాదాపు 3వేల మంది పాల్గొన్నారు. ఈరన్‌లో 90 మంది దివ్యాంగులు పాల్గొనడంతో పాటుగా దుర్గం చెరువు కేబుల్‌ వంతెన పై 100 మీటర్లు నడవడం ద్వారా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి కలిగించారు. ఈసంద‌ర్భంగా హైద‌రాబాద్ ఇనార్బిట్ మాల్ సెంట‌ర్ హెడ్ శ‌ర‌త్ బెలావ‌డి మాట్లాడుతూ….రెండవ ఎడిషన్‌ ఇనార్బిట్‌ హైదరాబాద్‌ హాఫ్‌ మారథాన్‌ను అధిక సంఖ్యలో పాల్గొన్న అభ్యర్థులతో నిర్వహించడం త‌మకు గర్వకారణంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం కోసం మద్దతునందించిన త‌మ భాగస్వాములు, ప్ర‌భుత్వ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ రన్‌లో ఉత్సాహంగా పాల్గొనడంతో పాటుగా ఫిట్‌గా ఉండేందుకు మరింతమందికి స్ఫూర్తి కలిగించిన వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement