Monday, April 29, 2024

జంట జలాశయాలకు పోటెత్తుతున్న వ‌ర‌ద‌..

రాష్ట్రంలో వాన‌లు దంచికొడుతున్నాయి. ఇప్ప‌టికే ప్రాజెక్టులు జ‌లక‌ళ‌ను సంత‌రించుకున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో హైదరాబాద్ జంట జలాశయాల్లోకి ఇన్‌ఫ్లో భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్‌లోకి 1300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దీంతో ఉస్మాన్ సాగర్ నాలుగు గేట్లు ఎత్తిన అధికారులు మూసీలోకి 1552 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1786 అడుగుల నీటిమట్టం ఉంది. అదే సమయంలో హిమాయత్ సాగర్‌లోకి 600 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో రెండు గేట్ల ద్వారా మూసీలోకి 660 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763 అడుగులుకాగా.. ప్రస్తుతం 1761 అడుగులకు నీటిమట్టం చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement