Sunday, April 28, 2024

ఈదురుగాలుల ఎఫెక్ట్‌.. హైద‌రాబాద్‌లో అత్యంత ఎత్తైన జాతీయ జెండా అవ‌న‌తం

హైదరాబాద్‌లో ఈదురు గాలులు వీయడంతో ఇవ్వాల‌ (మంగళవారం) సిటీ నడిబొడ్డున ఉన్న అత్యంత ఎత్తైన ఫ్లాగ్ పోస్ట్‌పై జాతీయ జెండాను అధికారులు తాత్కాలికంగా దించారు. బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చ‌రించ‌డంతో, ఎటువంటి నష్టం జరగకుండా ముద‌స్తు జాగ్రత్త‌తో జాతీయ‌ జెండాను అవ‌న‌తం చేశారు అధికారులు.

జాతీయ జెండాను తాత్కాలికంగా అవ‌న‌తం చేసిన‌ట్టు పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్‌ తెలిపారు. గాలి వేగం ఎక్కువగా ఉండటం, ఎత్తును బట్టి చూస్తే జెండా దెబ్బతినే అవకాశం ఉందని చెప్పారు. గాలి వేగం తగ్గిన వెంటనే జెండాను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement