Thursday, May 2, 2024

HYD: కుశల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ ఫెస్టివ్ కలెక్షన్‌ కు ముఖచిత్రంగా ఎంపికైన తారా సుతారియా

హైదరాబాద్ : విభిన్న శ్రేణి ఫ్యాషన్, వెండి ఆభరణాలను వేడుక చేసుకునే భారతదేశపు ప్రముఖ ఫ్యాషన్ జ్యువెలరీ బ్రాండ్ కుశల్స్, బాలీవుడ్ నటి, ట్రెండ్‌సెట్టర్ అయిన తారా సుతారియాతో భాగస్వామ్యనాన్ని చేసుకున్నట్లు సంతోషంగా వెల్లడించింది. ఈ భాగస్వామ్యం పై తారా సుతారియా మాట్లాడుతూ… కుశల్స్ ఫ్యాషన్ జ్యువెలరీతో భాగస్వామి చేసుకోవటం పట్ల తాను నిజంగా సంతోషిస్తున్నానన్నారు. వారి వైవిధ్యమైన కలెక్షన్ చక్కదనంను ప్రదర్శిస్తుందన్నారు. వారి అద్భుతమైన జిర్కాన్ స్టోన్ ఆభరణాలకు నిజమైన నిదర్శనం, ఇది తనకు వ్యక్తిగతంగా ఇష్టమైనదన్నారు.

పండుగల శ్రేణి ఒక ఫ్యాషన్ స్టేట్‌మెంట్ ఇవ్వడానికి, అవుట్‌షైన్ ది ఫెస్టివిటీస్ (ఉత్సవాల్లో మరింత ప్రకాశం జోడించడానికి) కి అనువైనదన్నారు. కుశల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ మార్కెటింగ్ డైరెక్టర్ అంకిత్ గులేచా మాట్లాడుతూ… కుశల్స్‌లో తాము తమ తాజా పండుగ కలెక్షన్‌ను ఆవిష్కరించినందున, పండుగ ఉత్సాహాన్ని మరింత వేడుక చేసుకోవడానికి తాము ఆసక్తిగా ఎదురు చూస్తున్నామన్నారు. ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ తారా సుతారియాతో తమ భాగస్వామ్యం ఈ కలెక్షన్ లో అంతర్లీనంగా ఉన్న అందం, అధునాతనతను ప్రధానంగా వెల్లడిస్తుందన్నారు. తమ కొత్త పండుగ కలెక్షన్ ను అన్వేషించడానికి తాము ప్రతి ఒక్కరినీ హృదయ పూర్వకంగా ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ కలెక్షన్ ఇప్పుడు మీ సమీప కుశల్స్ స్టోర్లలో కుశల్స్. కమ్ లో అందుబాటులో ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement